అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేతిపై ఎర్రని మచ్చలు దర్శనమిచ్చాయి. దాంతో ఆయనకు ఏమైందంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడిచింది.
ఈ విషయంపై తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘నా చేతులకు ఏమీ కాలేదు. అదంతా ఏఐ(కృత్రిమ మేధ) వల్ల కావొచ్చు’’ అని ఆయన తెలిపారు.