సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని శనివారం అనంతపురం జిల్లా ఎస్పీ కే. కే. ఎన్ అన్బురాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరించడం, సదరు వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసే పద్ధతి అయిన ఏ ఈ పీ ఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.