సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగా నాగార్జునను చీమకుర్తికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ దుర్గాప్రసాద్ శుక్రవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఐని మంత్రి సూచించారు.