హనుమంతునిపాడు మండల పరిధిలో వైఎస్సార్ పింఛన్ కానుక సొమ్ము శుక్రవారం 90 శాతం లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందచేసినట్లు ఎంపీడీఓ కె. లలిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో వివిధ కేటగిరీలకు చెందిన పింఛనుదారులు 3949 మంది ఉండగా వారిలో గ్రామ పంచాయతీ వలంటీర్లు ఫిబ్రవరి ఒకటో తారీకు న 80 శాతం పంపణీ చేసినట్లు తెలిపారు.