శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం ఎదురుగా ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. అరసవల్లి వైపు నుంచి పాలు వ్యాను సిమెంట్ డివైడర్లును ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాను పూర్తిగా బోల్తా కొట్టింది. ఊహించని ఈ సంఘటన తో అటు వైపు స్కూటర్ పై వస్తున్న వాహనదారుడు ప్రమాదానికి గురైన వ్యాను ను ఢీకొనడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ రెండు ప్రమాదాల్లో క్షతగాత్రులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.