వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఈసారి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం సమాలోచన చేస్తోంది. ఈ క్రమంలో తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని ప్రతిపాదించినా, చివరి నిమిషంలో తానే బరిలో దిగాలనే నిర్ణయానికి వచ్చారట.