విశాఖపై ఇంకా విషం చిమ్మొద్దు, అలా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు అని ఎల్లో మీడియాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖపట్నం, సర్క్యూట్ హౌజ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ... మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్ల 9 నెలల్లో జరిగిన అభివృద్ధి, పారిశ్రామిక రంగం పురోగతి గతంలో ఏనాడూ జరగలేదు.అంతకు ముందు 5 ఏళ్ల కంటే చాలా బాగా చేశాం. పారిశ్రామికంగా ఎంతో ఎదిగాం. దీనిపై ఎక్కడైనా మేము చర్చకు రెడీ అని సవాల్ విసిరారు.