ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సెంట్రల్ జైలులో మరో 36 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. దీంతో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 47కు పెరిగింది. అప్రమత్తమైన జైలు అధికారులు హెచ్ఐవీ సోకిన రోగులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
2023 డిసెంబర్లో లక్నో జైలులోని ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత 11 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.