పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోడేరు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తూర్పుపాలెంలో ఆసరా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు ముత్యాలపల్లికి చెందిన వాసుదేవ(13), నాగరాజు(12)గా పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa