హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చి వాటిలో 10 శాతం కూడా అమలు చేయలేక మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళాడని, పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టేనని ఎద్దేవా చేశారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలని సూచించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా వూయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైమస్ జగన్ అని కొనియాడారు. లోకేష్ బయట ఉంటే తెలుగుదేశం పార్టీ అవుట్ అని దాచేశారన్నారు. టికెట్ లేదని చెబితే బఫున్లంతా పార్టీలు మారుతారని, బాలశౌరీ అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ అని, ఎవరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి అని మంత్రి అంబటి మండిపడ్డారు.