జీవితం అంటే 100 మీటర్ల పరుగు పందెం కాదని, అదో మారథాన్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు.
గుజరాత్లోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 72వ గ్రాడ్యుయేషన్ డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత సవాళ్లను పరిష్కరించే తీరు తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. అదే సమయంలో యువత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.