తమను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలే కృష్ణుల్లాగా ముందుకు నడిపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్ని నాని మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఫొటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచాడని, ఇప్పుడు పార్టీ మారి సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. జంపింగ్ జపాంగ్ని వీరుడిలా పవన్ భావిస్తున్నాడని, కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదన్నారు. శత్రువులతో షర్మిల చేతులు కలిపి, బజారుకెక్కి సొంత అన్ననే దూషిస్తున్నారని, సీఎం అనుచరులు చూస్తూ ఊరుకొంటారా..? అని ప్రశ్నించారు.