భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థను రక్షించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. సరగసీ ద్వారా బిడ్డను కనేందుకు 44 ఏండ్ల అవివాహిత దాఖలుచేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ
మంగళవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కామెంట్ చేసింది. విదేశాల్లోలాగా వివాహం కాకుండానే తల్లులు కావటం భారతీయ వివాహ వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.