ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలోని ముదాపర్ ఏరియాకు చెందిన సేద్ యాదవ్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల సేద్ యాదవ్ కుమార్తె నీలిమ పెళ్లి జరిగింది. జిలాయ్గఢ్ జిల్లాకు లంకహుడా గ్రామానికి చెందిన కమ్హాన్ యాదవ్‌తో వివాహం జరిగింది.
అయితే పెళ్లికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు రిటర్న్ గిఫ్టుగా ఇచ్చాడు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సేద్ యాదవ్ తెలిపారు.