ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఏడు అంశాలతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు బుగ్గన తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర,
మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూ భద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అంశాల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించారు. రూ.2,86,389 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు.