ఎన్నికైన వారు ప్రజలకు జవాబుదారితనంతో పని చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. విఫల పక్షం, పలాయన ప్రతిపక్షం వెళ్ళిపోతుందన్నారు. మీడియాలో కనిపించాలనే అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారని చెల్లుబోయిన పేర్కొన్నారు.
స్పీకర్ పోడియం పైకి వెళ్లడంతో టీడీపీ పని అయిపోయిందన్నారు. రాజ్యాంగబద్దంగా నడవాల్సిన వారు... అందుకు విరుద్ధంగా నడుస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యానించారు.