ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి అసలు లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుతో పని చేసే వారు అంత అభివృధి నిరోధకులన్నారు. అయన మాట్లాడుతూ.... ఎస్సీల ఓట్లను హరించి రిగ్గింగులు చేసే సంస్కృతి చంద్రబాబుది ఏనాడైనా బలహీన వర్గాలని ఇంటికి పిలిచి గుక్కెడు నీళ్ళైనా చంద్రబాబు ఇచ్చాడా? ఓట్ల మీద ఉన్న ప్రేమ పేదలమీద బాబుకు లేదు బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు సీఎం జగన్ నడిపిస్తున్నారు. అహంకారంతో, అక్కసుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఏ పార్టీకి అధ్యక్షుడో అర్ధం కావటం లేదు . చంద్రబాబు మాట మాటకి నన్ను ఉద్దేశించి మాట్లాడారు. బానిసనని విమర్శిస్తున్నారు.చంద్రబాబుకి దళితులు అంటే వ్యతిరేకం.నా శాఖలో నేను ఏ విధంగా పనిచేశానో ప్రజలకు తెలుసుఇప్పటివరకు నేను ఎవరికీ తలవంచలేదు. అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి అసలు లేదు.నాకు సీఎం వైయస్ జగన్ అవకాశం ఇచ్చారు.రాష్ట్రపతి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళే పదవి నాకు కల్పించారు.నా జీవితంలో నేను పేద వారికి సేవ చేసే అవకాశం లభించింది.చంద్రబాబు పెద్ధిరెడ్డిని దోపిడీ చేశారు అంటున్నారు.రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్‌ను, చిత్తూరులో పెద్దిరెడ్డిని వీరు ఏమీ చేయలేరు. అందుకే ఆరోపణలు చేస్తున్నారు.గతంలో హెరిటేజ్ వాహనంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది వాస్తవం కాదా?హైదరాబాద్‌లో 100 కోట్ల ప్యాలస్ కట్టుకున్నది ఎవరు?ఒక దళిత నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబుతో పని చేసే వారు అంత అభివృధి నిరోధకులు అని అన్నారు.