తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,683 మంది భక్తులు దర్శించుకున్నారు.
21,177 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.