ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతతో గురువారం రామలింగా రెడ్డి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసినటువంటి ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భూమా అఖిలప్రియ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. మీ ఓటు విధ్వంసానికి కాదు అభివృద్ధికి వేయాలని పిలుపునిచ్చారు. భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి పునాదిపై నిర్మించిన వైసీపీ కోటను బద్దలు కొట్టి అభివృద్ధి కోసం పాటుపడే టీడీపీకి యువత తమ ఓటు వేయాలన్నారు.