పత్తికొండలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు శుక్రవారం స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ పరీక్షలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి గర్భిణీ మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గర్భిణీ మహిళలకు వారి సహాయకులకు పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత భోజనాన్ని పంపిణీ చేశారు. ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారిని కల్పన ప్రారంభించారు. సేవాదళ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.