పాదయాత్ర ద్వారా సమస్యల్ని తెలుసుకొని ఒక ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించిన ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో ధర్మవరం నియోజకవర్గానికి చైతన్య రథాల్ని తీసుకొస్తున్నట్టు ఆయన శనివారం ప్రకటించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని. అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు.