భారతదేశంలో మరణ శిక్షలు పెరిగాయని ఢిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తెలిపింది. దేశంలో మరణ శిక్షలపై వార్షిక గణాంకాల నివేదికను విశ్వవిద్యాలయం ప్రచూరించింది.
గడిచిన రెండు దశాబ్దాల కంటే 2023లో 561 మంది మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. 2023లో కొత్తగా 120 మందికి దిగువ కోర్టులు మరణ శిక్ష విధించాయి. వీరిలో లైంగిక నేరాలకు పాల్పడిన వారే అత్యధికంగా ఉన్నారు.