సీఎం జగన్ పై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్ ఉన్నా జగనన్న మద్యం దుకాణాల్లో దానికి నో ఛాన్స్ అని ఆయన అన్నారు. అసలు రహస్యం ఏంటీ? ఈ నగదు అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న? అంటూ ప్రశ్నించారు.
విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్రలు తిరగేసినా దొరకరేమోనని ఎద్దేవా చేశారు. జె బ్రాండ్ లతో హానికర కిక్ ను నింపి 30,000 మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa