చంద్రబాబు ట్రాప్ లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పడ్డారని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం ఎంత పాటు పడుతుందో ఆయనతో సహా అందరికీ తెలుసు అన్నారు. అయన మాట్లాడుతూ.... ఈ రోజు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాటలు బీసీల అందరినీ బాధకు గురిచేశాయి. బీసీల అభ్యున్నతి కోసం జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం ఎంత పాటు పడుతుందో ఆయనతో సహా అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో 11 మంది బీసీ మంత్రులున్నారు...వారివద్దే కీలకమైన శాఖలన్నీ ఉన్నాయి. బీసీల అవసరాలు తీర్చడానికి బీసీలు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగలరని ఆలోచించి బీసీలకు మంత్రివర్గంలో అత్యధికంగా వారికి ఇచ్చారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు..టేస్ట్ ఉంటుంది...జగన్ గారి పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరుగుతున్నారు. గతంలో చంద్రబాబు బీసీలను ఏ విధంగా అణచివేశాడో మనమే స్పష్టంగా చెప్పాం. నలుగురు బీసీలు రాజ్యసభకు వెళ్లారు. మరో ఎస్సీ సోదరుడు రాజ్యసభకు ఇప్పుడు వెళ్తున్నాడు. ఈ నెయ్యి వాసన ఇప్పుడు కనిపించడం లేదా జంగా కృష్ణమూర్తి? మీ ఆలోచన వేరే ఉందని అర్ధం అయింది. వెళ్తూ వెళ్తూ నింద వేయడం మీ స్థాయికి సరైంది కాదు. మీరు జగన్ గారి వద్ద విధేయంగా ఉన్నారు. జగన్ గారు కూడా మీపట్ల అదే విధంగా వ్యవహరించారు. మీరు ఏ ప్రతిపాదన చేసినా జగన్ గారు దాన్ని అమలులో పెట్టారు. ప్రభుత్వం అంటే పాలకులం కాదు సేవకులం అన్నాడు జగన్ గారు. గత ప్రభుత్వం ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి చేతులు దులుపుకుంటే ఈ ప్రభుత్వం బీసీలకు ఎంత ఇచ్చిందో నీకు తెలియదా? రాజకీయ దోపిడీ లేకుండా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే ఒక బెంచ్ మార్క్. ఇంత కాలానికి బీసీల ఆత్మగౌరవ రక్షకుడిగా వచ్చిన వ్యక్తి జగన్ గారు. ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల మనం ఆరాధించే మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయం నెరవేరుతోంది. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సమసమాజం కోసం రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది అని తెలిపారు.