ఇండోనేషియాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 204 మిలియన్ల మంది ప్రజలు ఈసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నేషనల్, ప్రావిన్షియల్, రీజినల్, రిజెన్సీ, సిటీ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం ఐదు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయాల్సి ఉంటుంది. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకే రోజు జరగడం ఇండోనేసియా ప్రత్యేకత.