తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. 35 ఏళ్ల వివాహిత ఒకరు స్థానిక భవనం వారి వీధిలో నివాసం ఉంటోంది. ఆమెను అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. గదిలో సదరు మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.