రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహేంద్రజీత్ సింగ్ మాల్వియా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో మాల్వియా జైపూర్‌కు రాలేదు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆయన సంతోషంగా లేరని, ఆయన పార్టీ మారితే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగులనుందని ప్రచారం సాగుతోంది.