అమెరికాలోని హూస్టన్‌కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ.. చంద్రుడి మీదకు ల్యాండర్‌ను పంపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా చంద్రుడిపైకి ‘ఒడిసిసెస్’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపారు. ఫిబ్రవరి 22న ఈ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విజయవంతమైతే తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ చంద్రుడి మీదకు ల్యాండర్ పంపిన ఘనతను సాధిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa