నిరుపేద వధూవరులకు `జగన్ చారిటబుల్ ట్రస్ట్` అండగా నిలిచింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కాళహస్తి ఆలయంలో నిర్వహించిన స్వామి–అమ్మవార్ల కళ్యాణోత్సవ సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి నిలబెట్టారు.జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా 48 మంది నిరుపేద నూతన వధూవరులకు ఉచితంగా బంగారు తాళిబొట్లు, నూతన వస్త్రాలను అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహాలు నిర్వహించడంలో కష్టాలు పడుతున్న కుటుంబాలకు ఇది పెద్ద అండగా మారిందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి హాజరై నూతన వధూవరులకు బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. గత 20 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు చేయూత అందించడం ఈ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడడం గర్వకారణమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa