ఐటీ సర్వీసెస్ కంపెనీ విప్రో గురువారం రూ.15 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా 60 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.250 ధరకు కొనుగోలు చేయనుంది. ఇది తమ అతిపెద్ద బైబ్యాక్ అని, పెయిడప్ క్యాపిటల్‌లో 5.7 శాతం వరకు కొనుగోలు చేస్తామని, జూన్ లోపు పూర్తవుతుందని సీఎఫ్‌ఓ అపర్ణ అయ్యర్ తెలిపారు. 2025-26లో కంపెనీ రూ.12 వేల కోట్లు డివిడెండ్‌గా ఇచ్చింది. జనవరి-మార్చి క్వార్టర్‌లో నికర లాభం రూ.3,501.8 కోట్లు, ఆదాయం రూ.24,236.3 కోట్లు. షేరుకి రూ.11 ఫైనల్ డివిడెండ్ కు బోర్డు ఆమోదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa