ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిపై స్నేహితులు దాడి.. మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2026, 03:42 PM

విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో 118, 119 నెంబరు గదులను అద్దెకు తీసుకున్న వాసుపల్లి సాయికిరణ్, జి. యశ్వంత్, రంప లక్ష్మీ సౌజన్య, నరవ సాయికుమార్, పుచ్చ సాయికిరణ్, మణి, శాంతికుమారి అనే స్నేహితులు. రాత్రి అందరూ మద్యం తాగగా.. ఆ సమయంలో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో, శాంతికుమారి తనకు మరొకరితో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తోందని నిలదీసిన సాయికిరణ్ . దీన్ని శాంతికుమారి ఖండించినప్పటికీ ఆగ్రహానికి లోనై ఆమెపై దాడి చేసి కొట్టిన సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్. దీంతో స్నేహితులు దాడి చేయడాన్ని అవమానంగా భావించి తీవ్ర మనస్తాపంతో 118వ నెంబరు గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకున్న శాంతికుమారి(27)ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరివేసుకుని కనిపించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపిన వైద్యులు 


ఈ విషయాన్ని స్నేహితులు శాంతికుమారి తల్లి ఆకుమర్తి రమ్యకు తెలపగా.. కుటుంబ సభ్యులతో వచ్చి ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి . దాడి చేసిన తర్వాత శాంతికుమారికి ఫిట్స్ వచ్చి పడిపోయిందని ముఖంపై నీళ్లుచల్లి లేపి 118 గదిలోకి పంపించామని.. శాంతికుమారి మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు తెలిపిన స్నేహితులు . అరగంటలో వచ్చేస్తా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది అంటూ కన్నీటి పర్యంతమైన శాంతికుమారి తల్లి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa