ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్, వ్యాపార సంబంధిత సందేశాలను సులభంగా గుర్తించేందుకు 'ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే చాట్‌లన్నీ ఆటోమేటిక్‌గా ఒక ప్రత్యేక విభాగానికి తరలించబడతాయి. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్, స్పామ్ మెసేజులను తగ్గించి, వ్యక్తిగత చాట్‌లను క్రమబద్ధంగా ఉంచడంలో సహాయపడుతుంది. 24 గంటల తర్వాత చాట్‌లు ప్రత్యేక విభాగానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు, అనంతరం సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa