పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి Mamata Banerjee కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించగా, ఆ పార్టీ నేత సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.“భాజపాను వ్యతిరేకించే వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు మరియు జాతీయ పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు పక్కన పెట్టాలి. మన ప్రధాన ప్రత్యర్థి భాజపానే. కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించి గూండాయిజానికి పాల్పడుతున్నాయి. టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి,” అని ఆమె ఆరోపించారు.ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ సహా పలు పార్టీ నేతలు తనతో మాట్లాడారని పేర్కొన్న ఆమె, ఎవరి సానుభూతి తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ రాజకీయ పోరాటంలో విజయం ఎవరిది అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీఎంసీకి ద్రోహం జరిగిందని కూడా ఆమె ఆరోపించారు.రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా కలిసి రావాలని, భాజపాను ఎదుర్కొనేందుకు ఐక్యంగా నిలవాలని ఆమె మరోసారి పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa