ఖమ్మంలోని రోటరీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ టీ స్టాల్‌లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, తీవ్ర శ్రమతో మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు టీ స్టాల్ యజమాని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa