ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సులో సడన్‌గా పొగలు.. ప్రయాణికులు హడలెత్తిపోయారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 09, 2026, 08:25 PM

మండల పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు.అదే సమయంలో రాత్రి విధుల్లో ఉన్న ఏఎస్సై రవి, కానిస్టేబుల్ రాజేంద్ర ఘటనాస్థలికి చేరుకుని తక్షణ చర్యలు తీసుకున్నారు. బస్సులో ఉన్న 46 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు ఐదు గంటలపాటు వారు రహదారి పక్కనే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ట్రావెల్స్ బస్సు సిబ్బంది ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగారు.చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa