తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గంటగంటకూ పరిస్థితులు మారిపోతూ ఉత్కంఠ పెరుగుతోంది.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తనకు ఉందని చెబుతూ Vijay నేతృత్వంలోని టీవీకే బృందం గవర్నర్ కార్యాలయానికి వెళ్లింది. అయితే ప్రారంభంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన లోక్‌భవన్ నుంచి తిరిగి టీవీకే కార్యాలయానికి వెళ్లిపోయారు.కొన్ని నిమిషాల వ్యవధిలోనే సాయంత్రం 6.30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం రావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. దీంతో విజయ్ తిరిగి లోక్‌భవన్‌కు బయలుదేరారు.ఈ మధ్యకాలంలో కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో పాటు వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం ప్రకటించాయి. ఈ మద్దతు వివరాలను సమర్పించేందుకు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవడానికి లోక్‌భవన్‌కు చేరుకున్నారు.అయితే గవర్నర్ షెడ్యూల్ కారణంగా తొలుత అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తర్వాత ఆయన తన కేరళ పర్యటనను రద్దు చేసుకుని సాయంత్రం 6.30 గంటలకు సమావేశానికి సమయం కేటాయించడంతో, విజయ్ మళ్లీ అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa