ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇంకా 19 మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఏ జట్టూ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోలేదు.ఈ పరిస్థితుల్లో మాజీ స్పిన్నర్ Ravichandran Ashwin ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే జట్లపై తన అంచనాలను వెల్లడించాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన దిల్లీ క్యాపిటల్స్‌కు ఇది ఏడో పరాజయం కావడంతో, ఆ జట్టు ముందుకు సాగడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో కేకేఆర్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఒకవేళ ఆ జట్టు టాప్-4లోకి వస్తే చాలా ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.“దిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. కేకేఆర్ కూడా రేసులో వెనుకబడొచ్చు. కానీ ఒకవేళ కోల్‌కతా అర్హత సాధిస్తే ఆ జట్టును ఆపడం చాలా కష్టం. వారు తిరిగి పుంజుకున్న తీరు అద్భుతం. అందుకే గతంలో మూడు టైటిళ్లు గెలిచారు” అని అశ్విన్ అన్నారు.లీగ్ దశ ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-2లో నిలిచే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లలో రెండు జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉండొచ్చని తెలిపారు.చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు బలపడతాయని చెప్పారు. ముఖ్యంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్‌కి చేరడం దాదాపు ఖాయమవుతుందని అశ్విన్ విశ్లేషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa