ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“సీబీఐ దాడులతో కలకలం.. అనిల్ అంబానీ కార్యాలయాలపై సోదాలు”

business |  Suryaa Desk  | Published : Sat, May 09, 2026, 09:50 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త Anil Ambaniకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలైన రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లపై నమోదైన కేసుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి ముంబయిలోని ఆయనకు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం వెల్లడించింది.కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తుల సంస్థల కార్యాలయాల్లోనూ సమాంతరంగా తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి సంస్థలు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసాల ఆరోపణలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రిలయన్స్ గ్రూప్‌పై ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ గతంలోనూ పలుమార్లు అనిల్ అంబానీకి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa