తమిళనాట ముఖ్యమంత్రి పదవిపై ఉన్న సందిగ్ధత తేలిపోయిన తర్వాత ఇప్పుడు అందరి చూపు పొరుగు రాష్ట్రం కేరళపై నిలిచింది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులు గడిచినా, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.దిల్లీలో Mallikarjun Kharge అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో కూడా సీఎం పేరును ప్రకటించలేదు. దీంతో ఈ అంశంపై ఆదివారం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్‌లు తమ నివేదికను ఖర్గేకు సమర్పించారు. అనంతరం శనివారం సాయంత్రం ఖర్గే నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.ఈ భేటీకి రాహుల్ గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, సీఎం పదవి రేసులో ఉన్న వీడీ సతీషన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల తదితరులు హాజరయ్యారు. అయినప్పటికీ తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు.సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ మీడియాతో మాట్లాడుతూ, సీఎం అభ్యర్థి ఎంపికపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంయమనం పాటించాలని ఆమె కోరారు. నాయకత్వ ఎంపికపై అధిష్ఠానం సమష్టిగా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.మరోవైపు సీఎం పేరు ప్రకటించే ముందు మరింత సలహా-మసలాహాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa