Indian Premier League 2026 సీజన్ తొలి భాగంలో మ్యాచ్‌లు అంతగా ఉత్కంఠ రేపకపోయినా.. రెండో దశలో మాత్రం జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో ప్రతి మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా Chennai Super Kings, Royal Challengers Bengaluru మ్యాచ్‌లకు భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్ నమోదవుతోంది.మే 1 వరకు జరిగిన మ్యాచ్‌ల టీవీ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ గణాంకాల ఆధారంగా బ్రాడ్‌కాస్టర్ Star Sports రూపొందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అందులో Chennai Super Kings మ్యాచ్‌లను సగటున 308 మిలియన్ల మంది వీక్షిస్తున్నట్లు పేర్కొంది. ఈ సీజన్‌లో MS Dhoni ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకపోయినా సీఎస్కేపై అభిమానుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్ Royal Challengers Bengaluru మ్యాచ్‌లను సగటున 303 మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. Virat Kohli ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీకి దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో వ్యూయర్‌షిప్ కూడా అధికంగా నమోదవుతోంది.మరోవైపు Mumbai Indians ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఆ జట్టు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ముంబయి మ్యాచ్‌లను సగటున 293 మిలియన్ల మంది వీక్షిస్తున్నట్లు స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. అనంతరం Sunrisers Hyderabad (290 మిలియన్లు), Kolkata Knight Riders (280 మిలియన్లు) జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa