ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యానాది కార్పొరేషన్, వర్గీకరణ కోసం జూన్ 30న మంగళగిరిలో భారీ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 09, 2026, 05:08 PM

యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.సి. పెంచలయ్య శనివారం బాపట్ల అంబేద్కర్ భవనంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ యానాది కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్టీ వర్గీకరణ సాధన కోసం జూన్ 30న మంగళగిరిలో 'యానాది మహాగర్జన' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నెరవేర్చకపోవడం దురదృష్టకరమని, యానాదులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యానాది నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa