ప్రపంచంలోనే అత్యధిక స్పామ్ కాల్స్ వచ్చే దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉందని ట్రూకాలర్ సంస్థ వెల్లడించింది. ఇండొనేషియా, చిలీ, వియత్నాం, బ్రెజిల్ దేశాల తర్వాత భారత్ ఈ జాబితాలో నిలిచింది. స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవడానికి ట్రాయ్ (TRAI) అధికారికంగా TRAI DND యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రమోషనల్ కాల్స్, SMSలను నిరోధించవచ్చు. యాక్టివేట్ చేసినా స్పామ్ కాల్స్ వస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు తమ ఆయా యాప్‌ల ద్వారా కూడా DNDని యాక్టివేట్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa