ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Royal Enfield అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన ఆటోమోటివ్ బ్రాండ్ల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో Ferrari, Audi వంటి అంతర్జాతీయ దిగ్గజాలను వెనక్కి నెట్టి, BMW, Toyota సరసన నిలిచింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో టయోటా తొలి స్థానంలో, బీఎండబ్ల్యూ రెండో స్థానంలో ఉండగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మూడో ర్యాంక్ సాధించింది. ఆడి నాలుగో స్థానంలో, ఫెరారీ ఏడో స్థానంలో నిలిచాయి.నివేదిక ప్రకారం, 100 బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ పాయింట్లలో Royal Enfield 88.9 పాయింట్లు సాధించి AAA రేటింగ్‌ను అందుకుంది. అలాగే కంపెనీ బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.11,337 కోట్లకు సమానం.ప్రస్తుతం Royal Enfield 80కిపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3,200కు పైగా రిటైల్ షోరూమ్‌లు కలిగి ఉండటం విశేషం. ముఖ్యంగా యూరప్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఈ బైక్‌లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకే పరిమితమైన ఈ బ్రాండ్, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో శక్తివంతమైన బ్రాండ్‌గా ఎదిగింది.Royal Enfield Hunter 350, Royal Enfield Super Meteor 650, Royal Enfield Himalayan 450 వంటి మోడళ్లు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, భారతీయ ఆటోమొబైల్ రంగానికి చెందిన మరికొన్ని సంస్థలు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. Tata Motors 5వ స్థానంలో, Mahindra & Mahindra 25వ స్థానంలో, Maruti Suzuki 34వ స్థానంలో నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa