ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ముంబయి ఇండియన్స్ జట్టు ఆదివారం తలపడనుంది. రాయ్‌పుర్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది.ఈ నేపథ్యంలో హోటల్ వద్ద Rohit Sharmaను చూసిన ఓ మహిళా అభిమాని ఆనందంతో అతని వైపు పరుగెత్తింది. అతనితో కరచాలనం చేసి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించగా, ఆమె ఫోన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అనంతరం అక్కడే ఉన్న ఓ చిన్న బాలుడితో రోహిత్ ఫొటో దిగిన తర్వాత బస్సు ఎక్కేందుకు ముందుకు సాగాడు.అయితే, ఆ మహిళా అభిమాని మరో వ్యక్తి వద్ద నుంచి మొబైల్ తీసుకుని తిరిగి రోహిత్ దగ్గరకు పరుగెత్తింది. ఆమె రావడం చూసిన హిట్‌మ్యాన్ కొద్దిసేపు వేచి ఉండి, ఆమెతో సెల్ఫీ ఇచ్చిన తర్వాతే బస్సు ఎక్కాడు.రోహిత్‌తో ఫోటో దిగే అవకాశం లభించడంతో ఆ అభిమాని ఆనందంలో మునిగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa