ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“UFOల మిస్టరీకి ఇంకా సమాధానం దొరకలేదు.. ఉన్నట్లా? లేనట్లా?”

international |  Suryaa Desk  | Published : Sat, May 09, 2026, 09:21 PM

మానవజాతిని ఎన్నో దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రశ్న ఇది — భూమి వెలుపల జీవం నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే అవి మనకంటే సాంకేతికంగా ముందున్నాయా? అవి భూమిని సందర్శించాయా? లేదా మనపై ఎలాంటి ప్రభావం చూపగలవా?ఆకాశాన్ని నిశితంగా పరిశీలించిన కొంతమందికి గుర్తు పట్టలేని కొన్ని వింత ఆకృతులు కనిపించాయి. ఇవే తరువాత కాలంలో “ఫ్లయింగ్ సాసర్లు”గా, ఆపై అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్స్‌ (UFOలు)గా, అలాగే అన్‌ ఐడెంటిఫైడ్‌ ఎనామలస్‌ ఫినామెనా (UAP)గా పిలవబడ్డాయి. ఇవి నిజమా కాదా అన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది.ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం Pentagon శుక్రవారం కొత్త రహస్య ఫైళ్లను విడుదల చేసింది. అయితే UFOలు ఉన్నాయా లేదా అన్న విషయంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేయకుండా, అందులోని సమాచారాన్ని ప్రజలే విశ్లేషించుకోవాలని పేర్కొనడం విశేషం. ఈ రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను పెంటగాన్ ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తోంది.తాజాగా విడుదల చేసిన వివరాల్లో ఎఫ్‌బీఐ, అమెరికా రక్షణ శాఖ, నాసా, విదేశాంగ శాఖలకు చెందిన మొత్తం 162 ఫైళ్లు ఉన్నాయి. వీటిలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, 28 వీడియోలు, 14 ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలు దశాబ్దాల కాలానికి చెందినవిగా తెలుస్తోంది. చాలా వీడియోలు సైనిక విమానాల్లో రికార్డు చేసినవే.అలాగే, అపోలో-12 మరియు అపోలో-17 మిషన్ల సమయంలో చంద్రుడి ఉపరితలం నుంచి నాసా శాస్త్రవేత్తలు తీసిన కొన్ని వింత దృశ్యాల ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. 2020 నుంచి 2026 మధ్య ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వీడియోలూ ఈ ఫైళ్లలో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల్లో కనిపించిన తెల్లటి కదలికలుగా ఉన్నాయి.2023లో గ్రీస్‌లో నమోదైన ఒక వీడియోలో గంటకు 80 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ 90 డిగ్రీల కోణాల్లో అకస్మాత్తుగా దిశ మార్చుకునే వస్తువు కనిపించింది. మరో వీడియోలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆకారంలో ఉన్న గుర్తు తెలియని వస్తువు కనిపించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa