ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతున్న 61వ వెనిస్ ప్రదర్శనలో ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) తరఫున Isha Ambani పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక విందులో ఆమె ప్రసంగిస్తూ భారతీయ కళలను ప్రపంచ వేదికపై పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అలాగే తన తల్లి Nita Ambaniపై ప్రశంసలు కురిపించారు. భారతీయ సంప్రదాయ నృత్య కళాకారిణిగా, ఉపాధ్యాయురాలిగా ఆమెకు ఉన్న కళాప్రేమే NMACC స్థాపనకు ప్రేరణగా నిలిచిందని అన్నారు.భారతీయ మూలాలు, కళలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇషా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa