ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ట్విస్ట్: Vijay ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం!

national |  Suryaa Desk  | Published : Sat, May 09, 2026, 07:53 PM

Tamil Nadu Government Formation | అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్కంఠ రేపిన తమిళనాడు రాజకీయాల్లో స్పష్టత వస్తోంది. అత్యధిక స్థానాలు దక్కించుకున్న Vijay నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్‌, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. గవర్నర్‌ Rajendra Vishwanath Arlekar కూడా సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.శనివారం గవర్నర్‌ను కలిసిన టీవీకే నేతలు, తమకు మద్దతిస్తున్న పార్టీల లేఖలను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. మిత్రపక్షాల మద్దతుతో మెజార్టీ మార్క్‌ (118) దాటడంతో గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు Vijay ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే దీనిపై రాజ్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పార్టీల వారీగా బలం:
*టీవీకే – 107
*కాంగ్రెస్‌ – 5
*సీపీఐ – 2
*సీపీఎం – 2
*వీసీకే – 2
*ఐయూఎంఎల్ – 2






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa