శ్రీశైలంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దిల్లీకి చెందిన ఆనంద్‌కుమార్ శ్రీశైలం మల్లికార్జున సదన్‌లో 9 ఏసీ గదులను ఒక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ.15 వేలు చెల్లించినట్లు తెలుస్తోంది.శనివారం దిల్లీ నుంచి 27 మంది యాత్రికులు హైదరాబాద్ మీదుగా టూరిస్ట్ బస్సులో శ్రీశైలం చేరుకున్నారు. అయితే మల్లికార్జున సదన్‌లో గదుల కోసం సంప్రదించగా, అక్కడ ఎలాంటి బుకింగ్ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు.ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం ఈవో Srinivasa Rao స్పందించారు. బాధిత యాత్రికులకు తక్షణ సహాయం అందించి, ఉచిత వసతి, భోజనం, దర్శన ఏర్పాట్లు చేయించారు.భక్తుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదును దేవస్థానం పీఆర్‌వో స్వీకరించారు. సైబర్ మోసంపై కేసు నమోదు చేయాలని ఈవో నిర్ణయించినట్లు సమాచారం.ఇక దేవస్థానం అందించిన సహకారం, వసతి, దర్శన ఏర్పాట్లపై యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa