మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలో గురువారం హింస చెలరేగింది. విలేజ్ డిఫెన్స్ వాలంటీర్ల బంకర్లో కొందరు ఆయుధాలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఓ హెడ్ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అతడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా పోలీసు చీఫ్ కార్యాలయం వెలుపల స్థానికులు నిరసన చేపట్టారు. బస్సుకు నిప్పు పెట్టారు. పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు.