ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (60) రెండో పెళ్లి చేసుకోనున్నారు. ఆర్థిక సేవల నిపుణురాలైన జోడీ హేడన్ను ఆయన వివాహమాడనున్నారు. వారిద్దరూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
ప్రేమికుల రోజున (ఈ నెల 14) తాను చేసిన పెళ్లి ప్రతిపాదనకు హేడన్ అంగీకరించినట్లు అల్బనీస్ గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. పదవిలో ఉండగా వివాహం చేసుకున్న తొలి ఆస్ట్రేలియా ప్రధానిగా ఆయన రికార్డులకెక్కనున్నారు.